Advertisementt

నయన్-విగ్నేష్ ఓ అందాల రాక్షసి

Mon 11th Jul 2022 09:40 PM
malaika arora,nayanthara,vignesh shivan  నయన్-విగ్నేష్ ఓ అందాల రాక్షసి
Malaika Arora poses with newlyweds Nayanthara, Vignesh నయన్-విగ్నేష్ ఓ అందాల రాక్షసి
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో 40 ఏళ్ళు పైబడినా తన అందాలతో యూత్ ని తన చుట్టూ తిప్పుకోగల సత్తా ఉన్న మాజీ హీరోయిన్ మలైకా అరోరా. కుర్ర హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ అంటూ కలిసి తిరుగుతున్న మలైకా త్వరలోనే అతన్ని పెళ్లాడబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక జిమ్ కి వెళ్లే మలైకా అరోరా చుట్టూ ఫోటో గ్రాఫర్స్ ఈగల్లా వాలిపోతారు. ఆమె అందాలు ఎక్సపోజ్ అయ్యేలా ఫొటోస్ తీస్తారు. ఇంకా అవార్డు ఫంక్షన్స్, వెడ్డింగ్ రిసెప్షన్స్ కి స్పెషల్ డిజైనర్ వేర్ లో మలైకా మెరిసిపోతూ ఉంటుంది. 

అయితే ప్రస్తుతం జవాన్ షూటింగ్ లో పాల్గొనడానికి నయనతార చెన్నై టు ముంబై అంటూ అప్ డౌన్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ తో కలిసి అట్లీ దర్శకత్వంలో నయన్ జవాన్ లో నటిస్తుంది. ముంబై షూటింగ్ లో ఉన్న నయన్ దగ్గరకు ఆమె భర్త విగ్నేష్ కూడా వచ్చారు. ఈ కొత్త దంపతులు ఇద్దరూ హోటల్ రూమ్ లో ఉన్నారని తెలిసిన మలైకా అరోరా ప్రత్యేకంగా గ్లామర్ గా రెడీ అయ్యి మరీ నయన్- విగ్నేష్ దంపతుల దగ్గరకు వెళ్లి వారికి కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా ఓ పిక్ కూడా దిగి స్టోరీస్ లో పెట్టింది. ఆ పిక్ లో నయనతార - విగ్నేష్ లు చాలా సింపుల్ గా కనిపించగా నయనతార మేడలో తాళి బొట్టు మాత్రం హైలెట్ అయ్యింది. ఇక మలైకా, నయనతార, విగ్నేష్ ల పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Malaika Arora poses with newlyweds Nayanthara, Vignesh:

Malaika Arora meets newlyweds Nayanthara and Vignesh Shivan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ