Advertisementt

ఆగష్టు నుండి అన్ స్టాపబుల్ 2

Mon 11th Jul 2022 08:43 PM
unstoppable 2,balakrishna,chrianjeevi,aha ott  ఆగష్టు నుండి అన్ స్టాపబుల్ 2
Unstoppable 2 from August ఆగష్టు నుండి అన్ స్టాపబుల్ 2
Advertisement
Ads by CJ

ఆహా ఓటిటిలో బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఆహాకి డబ్బులు తెచ్చిపెడితే బాలకృష్ణ కి విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. బాలయ్య ఫాన్స్ కాలర్ ఎగరేసేలా చేసింది ఆ షో. సెలబ్రిటీస్ తో ఇంటర్వూస్ అంటూ బాలకృష్ణ తనలోని మరో కోణాన్ని పరిచయం చేసారు. ఆయన స్టైలిష్ లుక్స్, ఆయన చేసిన అల్లరి ఆ టాక్ షో ని సక్సెస్ చేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ బాబు, రవితేజ ఇలా బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ హంగామా చేసారు. అల్లు అరవింద్ వేసిన స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది. మెగా కాంపౌండ్ లో నందమూరి హీరో కాలు పెట్టడం అది వర్కౌట్ కాకపోవడం అన్నట్టుగా అన్ స్టాపబుల్ హిట్ అయ్యింది.

ఇప్పుడు సెకండ్ సీజన్ కోసం ఫాన్స్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా ప్రియులు ఎదురు చూసేలా చేసింది. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 అంటూ ఆహా వాళ్ళు ప్రకటించారు. అది ఆగస్టు నుండి ప్రసారం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆగష్టు నుండి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 ని మొదలు పెట్టబోతున్నారు అని అంటున్నారు. మెగాస్టార్ చిరు ఫస్ట్ గెస్ట్ గా సీజన్ 2 కి వస్తారని అంటున్నారు. మరి బాలకృష్ణ - చిరంజీవి ఒకే స్టేజ్ పై అంటే ఆ కిక్కే వేరు. ఆ ఎపిసోడ్ కోసం మెగా ఫాన్స్, నందమూరి ఫాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఆగష్టు నుండి అంటున్నారు. అదేదో అధికారిక ప్రకటం ఇస్తే ఫాన్స్ కూల్ అవుతారు కదా.. 

Unstoppable 2 from August:

Unstoppable season 2 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ