రాజమౌళి ప్రభాస్ తో చేసిన బాహుబలి పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ చెయ్యడానికి ఎంతో శ్రమించారు. అటు సినిమా చెయ్యడం ఒక ఎత్తైతే.. మరొక ఎత్తు ఆడియన్స్ లోకి సినిమాని తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డారు. లెక్కకు మించిన థియేటర్స్ లో రిలీజ్ చేసారు. తర్వాత ట్రిపుల్ ఆర్ విషయం చెప్పేదేముంది. రెండుసార్లు ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ని చేపట్టి సినిమాని అన్ని రకాల వర్గాలకు రీచ్ అయ్యేలా చేసారు. రాజమౌళి సినిమాలు సక్సెస్ కి కారణం ఆయన చేసే ప్రమోషన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ బాహుబలి, ట్రిపుల్ ఆర్ లకి మించి పుష్ప 2 ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారట.
సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 స్క్రిప్ట్ లాక్ చేసుకుని షూటింగ్ కోసం రెడీ అయ్యారు. ఆగష్టు నుండి పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. సుకుమార్ కూడా మిగతా నటుల ఎంపికలో తలమునకలై ఉన్నారట. ఇప్పటికే విజయ్ సేతుపతిని మరో విలన్ కేరెక్టర్ కి ఎంపిక చేసినట్లుగా మీడియాలో న్యూస్ లు ప్రసారంలో ఉన్నాయి. అలాగే దేవిశ్రీ తో కలిసి సుకుమార్ ట్యూన్స్ కూడా లాక్ చేసాడు అంటున్నారు. మరోపక్క అల్లు అర్జున్ తరచుగా సుకుమార్‌ని కలుస్తూ స్క్రిప్ట్ విషయంలో చర్చలు జరుపుతున్నారట. 2023 ద్వితీయార్ధంలో సౌత్ లోనే అతిపెద్ద పాన్ ఇండియా ఫిలిం గా రిలీజ్ చెయ్యాలను మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు. బడ్జెట్ లో కానీ, రిలీజ్ అయ్యే థియేటర్స్ విషయంలో కానీ, ప్రమోషన్స్ కానీ ఇలా ఏ ఒక్క విషయంలో అయినా బాహుబలి, ట్రిపుల్ ఆర్ లనే టార్గెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.