పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకి ప్రాణం అని, నాగబాబు గారు అన్నా, చిరంజీవి గారు అన్నా చాలా ఇష్టమని జబర్దస్త్ లో హైపర్ ఆది చాలాసార్లు చెప్పాడు. నాగబాబు గారు ఉన్నా లేకపోయినా నేను అదే మాట చెబుతాను అని, ఆయనతో ఆ చనువు ఉంది అని, ఆయన ముందొకలా, వెనకాల ఒకలా ఉండడం తనకి చేతకాదని, పవన్ కళ్యాణ్ గారంటే ఎక్కువ ఇష్టం అని, ఆయనతో సినిమాలు చేశాను అని, అంతేకాకుండా జనసేన ప్రచారానికి పిలిస్తే నావంతు ప్రచారం చేస్తాను అని హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది. రీసెంట్ గా నాగబాబు గారిని కలిసి అడిగాను, బాబు గారు జనసేన ప్రచారానికి నేను అవసరం అనుకుంటే ఎక్కడ ప్రచారం చెయ్యమన్నా చేస్తాను అని అడిగాను. ఆయన చెబుతా అన్నారు.
అయితే 2024 ఎన్నికల్లో జనసేన తరుపున హైపర్ ఆది ప్రచారం చెయ్యడమే కాకుండా, పోటీ చేయబోతున్నాడనే మాట వినిపిస్తుంది అది నిజమేనా అని సదరు యాంకర్ ఆదిని ప్రశ్నించగా.. అదేం లేదు, నేను జనసేన తరపున పోటీ చెయ్యడం లేదు, కేవలం ప్రచారానికి వాళ్ళు పిలిస్తే మాత్రం వెళతాను అంటూ స్ఫష్టతనిచ్చాడు. ప్రస్తుతం, హైపర్ ఆది జబర్దస్త్ కి దూరంగా, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీకి దగ్గరగా ఉంటున్నాడు. అంతేకాకుండా సినిమాలకు డైలాగ్స్ రాసే పనిలో బాగా బిజీ అయ్యాడు.