Advertisementt

నితిన్ పై డాన్స్ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Mon 11th Jul 2022 05:40 PM
amma rajasekhar,nithiin,hero nithin,hi5  నితిన్ పై డాన్స్ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్
Dance Master Sensational Comments on Nithin నితిన్ పై డాన్స్ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

అమ్మ రాజశేఖర్ కేవలం డాన్స్ మాస్టర్ మాత్రమే కాదు ఆయనొక డైరెక్టర్ కూడా. మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన మళ్ళీ బిగ్ బాస్ ద్వారా ఫెమస్ అయ్యాడు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ ఓ మూవీ చేసారు. హైఫై అనే మూవీ చేసి గత రాత్రి అంటే ఆదివారం సాయంత్రం ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుని హీరో నితిన్ ని గెస్ట్ గా పిలిచారట. గతంలో అమ్మ రాజశేఖర్ నితిన్ కి మాస్టర్ గా డాన్స్ కూడా నేర్పించడంతో తన సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా రమ్మని పది రోజుల క్రితమే నితిన్ ని పిలవగా వస్తానని చెప్పాడట నితిన్. కానీ ఈవెంట్ కి రాకుండా నితిన్ హ్యాండ్ ఇవ్వడంతో అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ గా నితిన్ పై హాట్ కామెంట్స్ చేసాడు. 

నితిన్ కావాలనే తన ఈవెంట్ కి రాలేదు అని, తనని నితిన్ ఇన్సల్ట్ చేసాడని, గురువుపై గౌరవం ఉండి వస్తాడనుకున్నా.. కానీ ఇంట్లోనే ఉండి రాలేదు. ఫోన్ చేసి అడిగినా రాలేదు. ఫీవర్ అని చెప్పి తప్పించుకున్నాడు. కనీసం వీడియో బైట్ ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు అని, నితిన్ ఇలా చేస్తాడు అనుకోలేదు. జీవితంలో ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా గురువుని మర్చిపోకూడదు అని, నితిన్ వస్తా అని చెప్పి రాలేదు, రానని చెబితే సరిపోయేది. రాకుండా నన్ను అవమానించావు. నాకు చాలా బాధగా ఉంది అంటూ నితిన్ పై అమ్మ రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Dance Master Sensational Comments on Nithin:

Amma Rajasekhar Sensational Comments on Nithiin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ