Advertisementt

ఆగష్టు 12 నుండి వెనక్కి తగ్గిన సమంత యశోద

Mon 11th Jul 2022 01:08 PM
samantha,yashoda,yashoda shoot wrapped up,yashoda postponed  ఆగష్టు 12 నుండి వెనక్కి తగ్గిన సమంత యశోద
Samantha Yashoda postponed ఆగష్టు 12 నుండి వెనక్కి తగ్గిన సమంత యశోద
Advertisement
Ads by CJ

సమంత లేటెస్ట్ చిత్రం యశోద. ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన యశోద షూటింగ్ ఒక సాంగ్ మినహా టాకీ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.

సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశామని.. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నామని, ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది అని. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కుడా అదే స్థాయిలో మొదలు పెట్టబోతుననట్లుగా నిర్మాత చెబుతున్నారు. అయితే యశోద ని ఆగష్టు 12 న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. 

కానీ పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి యశోద పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాము అని.. ముందు అనుకున్న విడుదల తేదీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. సమంత యశోద పాత్రని సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. చాలా ఏకాగ్రతతో, పూర్తి డెడికేషన్ తో యాక్షన్ మరియు ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేసింది. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరూ చిత్రం అద్భుతంగా వచ్చేలా సహకరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం అంటూ నిర్మాత చెప్పారు.

Samantha Yashoda postponed:

Samantha Yashoda shoot wrapped up, except a song!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ