పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికతను, ప్రశాంతని కోరుకునే వ్యక్తి. ఆయన గత కొన్నేళ్లుగా చాతుర్మాస దీక్ష తీసుకుని కఠిన నియమాలను పాటిస్తూ దీక్షని పాటిస్తున్నారు. ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఆదివారం తొలిఏకాదశి పర్వదినం రోజున ఈ చాతుర్మాస దీక్షలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండడం, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు బావుండాలని ఈ దీక్ష చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో దాదాపు నాలుగు నెలలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.
మెగా ఫ్యామిలిలో చిరంజీవి హనుమాన్ దీక్ష తీసుకుంటారు, రామ్ చరణ్ ఎక్కువగా అయ్యప్ప మాలలో ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేస్తారు. దానికి స్పెషల్ గా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు. మరోపక్క సినిమా షూటింగ్స్ తో బిజీ గా వున్నారు. క్రిష్ తో హరి హర వీరమల్లు పక్కనబెట్టి, మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్ లో నటిస్తున్నారు. తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి మూవీస్ లైన్ లో ఉన్నాయి.