జబర్దస్త్ లో అదిరే అభి టీం లో పని చేసి తర్వాత టీం కి వన్ అఫ్ ద లీడర్ గా మారి పంచ్ లతో కామెడీ ప్రియులని ఆకట్టుకున్న పంచ్ ప్రసాద్ కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా జబర్దస్త్, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటివి ప్లస్ లో జాతి రత్నాలులో తన కామెడీ పంచ్ లతో చెలరేగిపోయాడు. అయితే పంచ్ ప్రసాద్ ఆరోగ్య రీత్యా కొన్నాళ్ళు జబర్దస్త్ కి దూరమయ్యాడు. అతనికి కిడ్నీ ట్రాన్సప్లంటేషన్ జరిగింది. చావుబ్రతుకుల మధ్యన ఉన్న పంచ్ ప్రసాద్ ని జబర్దస్త్ టీం తో పాటుగా, జేడ్జ్ లుగా ఉన్న నాగబాబు, రోజా లు తమ ఒక ఎపిసోడ్ పారితోషకాలు వేసుకుని బ్రతికించిన విషయం రీసెంట్ గా హైపర్ ఆది బయటపెట్టాడు.
పంచ్ ప్రసాద్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, జబర్దస్త్ టీం మేట్స్ తనకి పునర్జన్మనిచ్చారని. అదే విషయం ఆది చెబుతూ మల్లెమాల వాళ్ళు ఎవ్వరినీ వదిలెయ్యలేదు అని, పంచ్ ప్రసాద్ కి తాత్కాలికంగా మేము డబ్బు కట్టి బ్రతికిస్తే.. అతను జీవితంలో సంతోషంగా బ్రతకడానికి మల్లెమాల యాజమాన్యం మళ్ళీ ఆయన్నీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇప్పించడమే కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ లో అతను ఉండేలా చూసారని, అలాగే నెలకి 26 రోజులు జాతిరత్నాలులో కామెడీ చేసే పంచ్ ప్రసాద్ కి మల్లెమాల నుండి నెలకి అక్షరాలా మూడున్నర లక్షల జీతం వెళుతుంది అంటూ హైపర్ ఆది పంచ్ ప్రసాద్ రెమ్యునరేషన్ ని లీక్ చేసాడు.