Advertisementt

అస్సలు కనిపించని హ్యాపీ బర్త్ డే హావ

Sun 10th Jul 2022 05:06 PM
happy birthday,box office collection,occupancy,happy birthday movie  అస్సలు కనిపించని హ్యాపీ బర్త్ డే హావ
Happy Birthday Box Office Collection అస్సలు కనిపించని హ్యాపీ బర్త్ డే హావ
Advertisement
Ads by CJ

గత శుక్రవారం ఫన్నీ ఎంటర్టైనర్ గా మంచి ప్రమోషన్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయిన లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్ ల హ్యాపీ బర్త్ డే మూవీ ప్రేక్షకుడి అంచనాలను అందుకోవడం విఫలం అయ్యింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షోకే ఆడియన్స్ నుండి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంతేకాకుండా క్రిటిక్స్ కూడా ఆ సినిమాకి దారుణమైన రివ్యూస్ ఇచ్చారు. మత్తువదలరా లాంటి మంచి కామెడీ మూవీ చేసిన దర్శకుడు రితేష్ రానా హ్యాపీ బర్త్ డే విషయం టోటల్ గా ఫెయిల్ అయ్యాడు.

కథ, కథనం, డైరెక్షన్, సెకండ్ హాఫ్ అన్నీ వీక్ గా ఉండడం, కామెడీ పేలకపోవడంతో ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేయలేకపోయారు. దానితో ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది అనే విషయాన్ని ప్రేక్షకుడు మరిచిపోయాడు. గత వారం పక్కా కమర్షియల్ మూవీ కూడా సో సో గా ఉండడంతో ఆడియన్స్ రెండు వారాలుగా బోర్ ఫీలవుతున్నారు. హ్యాపీ బర్త్ డే థియేటర్స్ లో కనీసం 20 పెర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కనిపించడం లేదు, అందులోనూ భారీ వర్షాలతో జనాలు థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలో లేరు. సో హ్యాపీ బర్త్ డే టైటిల్ లో మాత్రమే.. పార్టీ మూడ్, సినిమాలో ఎలాంటి పార్టీ లేదు అంటూ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. 

Happy Birthday Box Office Collection:

Here is Happy Birthday box office collection and Occupancy.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ