Advertisementt

అందుకే జబర్దస్త్ నుండి తప్పుకున్నా: ఆది

Sun 10th Jul 2022 04:01 PM
hyper aadi,jabardasth,aadi interview,hyper aadi - ram prasad,sridevi drama company  అందుకే జబర్దస్త్ నుండి తప్పుకున్నా: ఆది
Reasons Behind Hyper Aadi Quit From Jabardasth అందుకే జబర్దస్త్ నుండి తప్పుకున్నా: ఆది
Advertisement
Ads by CJ

మినిస్టర్ అయ్యి రోజా జబర్దస్త్ నుండి వెళ్లకముందే హైపర్ ఆది మెల్లగా జబర్దస్త్ కి దూరమయ్యాడు. అయితే అది జబర్దస్త్ కి దూరమవడం పట్ల రకరకాల అనుమానాలు చాలా మందిలో మొదలయ్యాయి. అతనికి పేమెంట్స్ విషయంలో అసంతృప్తి ఉండబట్టే జబర్దస్త్ కి దూరమయ్యాడని అన్నారు. అలాగే ఈటీవికి దూరమయ్యే ఆలోచనలోనే ఆది జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరిగింది. జరుగుతుంది. కానీ ఢీ డాన్స్ షోలోను, శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది రెగ్యులర్ గా కనిపించడమే కాదు, కామెడీ పంచెస్ తో రెచ్చిపోతున్నాడు. అయితే హైపర్ అది జబర్దస్త్ కి దూరంగా ఉండడం అనే దానిపై ఎవరికీ క్లారిటీ రాలేదు.

తాజాగా హైపర్ ఆది కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చే ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ కి ఎందుకు దూరమయ్యానో అనేది స్పష్టతనిచ్చాడు. తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని, ధనుష్ సర్ సినిమా ఉంది అని, అంతేకాకుండా తాను కొద్దిగా బిజీగా ఉండడం వలనే జబర్దస్త్ కి దూరమవ్వాల్సి వచ్చింది అని, మళ్ళీ కొన్నాళ్ల తర్వాత తాను జబర్దస్త్ కి వస్తాను అని, ప్రస్తుతం మెంటల్ ప్రెజర్ వలన తాను స్కిట్స్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, అలాగే రిహార్సల్స్ కి టైం కేటాయించలేకపోతున్నాను అని.. అందుకే జబర్దస్త్ ని వదలాల్సి వచ్చింది అని, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోస్ లో చేస్తున్నాను అంటే మల్లెమాల సంస్థలోనే ఉన్నాను అని, జబర్దస్త్ లో నేను మానెయ్యడంపై వస్తున్న వార్తలకు ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని ఇదంతా చెబుతున్నాను అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. 

Reasons Behind Hyper Aadi Quit From Jabardasth:

Hyper Aadi Clarity about Quit From Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ