Advertisementt

సలార్: ప్రభాస్ ఇంట్రో సీన్ అలా డిజైన్

Sun 10th Jul 2022 03:38 PM
prabhas,salaar movie,prashanth neel,salaar update  సలార్: ప్రభాస్ ఇంట్రో సీన్ అలా డిజైన్
Interesting news on Prabhas Salaar movie సలార్: ప్రభాస్ ఇంట్రో సీన్ అలా డిజైన్
Advertisement
Ads by CJ

కేజిఎఫ్ చాప్టర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నారు. మే లో సలార్ రెస్యూమ్ షూట్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లోనే స్టే చేసారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లోనే సలార్ చిత్రీకరణ జరుగుతుంది. అటు ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సెట్స్ కి సలార్ సెట్స్ కు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. జూన్ లో ప్రభాస్ పై హై ఓల్టేజ్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. సలార్ లో యాక్షన్ సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలవబోతున్నాయంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే సలార్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అన్నారు. సముద్రం ఫైట్ మెయిన్ హైలెట్ గా నిలవబోతుంది అన్నారు. తాజాగా సలార్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కేక అంటున్నారు. ఓ భారీ లోయలో ఉన్న గుహలో సలార్ లో ప్రభాస్ ఇంట్రో సీన్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రడక్షన్ సీన్ ఏ ఇండియన్ సినిమాలోనూ చూపించని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. సలార్ లో ఈ సీక్వెన్స్ కోసం విదేశాలకు చెందిన టెక్నీషియన్లను ప్రశాంత్ నీల్ తీసుకురాబోతున్నారని చెబుతున్నారు. కేజిఎఫ్ కి మించి సలార్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. పృథ్వీ రాజ్ సుకుమార్ కీ రోల్ లో పోషిస్తున్నారు.

Interesting news on Prabhas Salaar movie:

 Prabhas Salaar movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ