Advertisementt

విక్రమ్​ వీడియో మెసేజ్​.. ఇప్పటిది కాదు!

Thu 14th Jul 2022 12:21 PM
chiyaan vikram,video message,old video,viral,hero vikram,vikram hospitalized,chest discomfort  విక్రమ్​ వీడియో మెసేజ్​.. ఇప్పటిది కాదు!
Chiyaan Vikram Old Video Message goes viral విక్రమ్​ వీడియో మెసేజ్​.. ఇప్పటిది కాదు!
Advertisement
Ads by CJ

తన ఆరోగ్యంపై హీరో విక్రమ్​ వీడియో మెసేజ్​ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో స్వయంగా విక్రమ్ మాట్లాడుతూ.. తనపై ప్రేమ, అభిమానం చూపించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది తనపై ప్రేమ చూపించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. దీంతో.. ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆయన ఇంత త్వరగా కోలుకుని, ఇలా వీడియో మెసేజ్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ రిప్లయ్ ఇస్తున్నారు. విక్రమ్‌కు జాగ్రత్తలు చెబుతూ.. కొంతకాలం రెస్ట్ తీసుకున్నాక.. మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనాలని హితబోధ కూడా చేస్తున్నారు. అయితే.. విక్రమ్ థ్యాంక్స్ చెబుతున్న వీడియో మెసేజ్ ఇప్పటిది కాదనే విషయం.. ఎవరూ గమనించలేదు. 

 

ఆ వీడియో 2018లో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి.. విక్రమ్ ధన్యవాదాలు చెబుతున్న వీడియో అది. ఆ వీడియోని ఇప్పుడెవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ఇప్పటిదే అనుకుని అంతా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ హెల్త్‌కి సంబంధించి ఎటువంటి సమాచారం బయటికి రాలేదు. ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయిన రోజు అఫీషియల్‌గా హాస్పటల్ వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మినహా.. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆ తదుపరి ఎటువంటి అప్‌డేట్ తెలియలేదు. కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయనిప్పుడు కోలుకుని, క్షేమంగానే ఉన్నారని మాత్రం తెలుస్తుంది.

 

అసలేం జరిగిందంటే.. చియాన్ విక్రమ్ ఛాతి నొప్పితో​ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలు అలా స్ర్పెడ్ అవుతున్న సమయంలోనే చెన్నై కావేరి హాస్పిటల్‌ వైద్యులు అధికారికంగా విక్రమ్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్​కు వచ్చారని, నిపుణులైన వైద్యులు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుపుతూ.. హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Chiyaan Vikram Old Video Message goes viral :

Chiyaan Vikram hospitalized due to chest discomfort 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ