కేజిఎఫ్ తో కన్నడ నుండి దూసుకొచ్చిన స్టార్ కెరటం యశ్. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా మార్కెట్ ని దడదడలాడించిన కేజిఎఫ్ తో ఒక్కరిగా ఫెమస్ అయ్యారు హీరో యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ చేసిన కేజిఎఫ్ సీరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ - యశ్ ఇద్దరూ ఈక్వెల్ గా పాపులర్ అయ్యారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్, ఎన్టీఆర్ తో NTR31 అంటూ బిగ్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. కానీ యశ్ కేజిఎఫ్ 2 రిలీజ్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నారు.
ఇప్పుడు తన 19 వ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. Yash19 పేరుతొ ఆ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ రాబోతుంది. దానితో యశ్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే యశ్ తన తదుపరి Yash19 ని నర్తన్ దర్శకత్వంలో చెయ్యబోతున్నారనే ప్రచారం ఉన్నా.. అది అధికారికంగా తెలియలేదు. ఇప్పుడు యశ్ - నర్తన్ మూవీ నే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం యశ్ క్రేజ్ తో Yash19 సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.