డిశ్చార్జ్ అయిన విక్రమ్: వీడియో రిలీజ్
Hero Vikram discharged from hospitalరెండు రోజుల క్రితం స్టార్ హీరో విక్రమ్ ఛాతి నొప్పితో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అవడంతో అభిమానులు ఆందోళపడగా.. మీడియాలో విక్రమ్ కి కార్డియా అరెస్ట్ అంటూ వార్తలు రావడం, ఆ తర్వాత కావేరి ఆసుపత్రి వర్గాలు విక్రమ్ కి ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యడం, మరోపక్క విక్రమ్ కొడుకు ధృవ్ కూడా తండ్రి విక్రమ్ కి ఏమి కాలేదు అని, ఆయనకు గుండెపోటు అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, విక్రమ్ ఆరోగ్యం పై ఎలాంటి పుకార్లు వ్యాప్తి చెయ్యొద్దు అంటూ రిక్వెస్ట్ చేసారు.
తాజాగా విక్రమ్ పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే విక్రమ్ తాను ఆరోగ్యంగా పర్ఫెక్ట్ గా ఉన్నాను అంటూ ఓ వీడియో ని రిలీజ్ చేసి తన ఆరోగ్యం పై ఆందోళన చెందవద్దు అని, తనపై ఇంత ప్రేమ అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని, తనపై ఇంత ప్రేమ చూపించడం ఆనందంగా ఉంది అని ఆ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. విక్రమ్ ఆరోగ్యం గా ఉండడం చూసిన ఆయన ఫాన్స్ కూల్ అవుతున్నారు.
Chiyaan Vikram is fully recovered and discharged from the hospital







































