లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా జూన్ 3 న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి 400 కోట్లు కొల్లగొట్టింది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమ్ రీసెంట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. హాట్ స్టార్ లో విక్రమ్ ని వీక్షించిన ప్రేక్షకులు లోకేష్ కనగరాజ్ ని తెగ పొగిడేస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లలేని ఫ్యామిలీ ఆడియన్స్, స్టూడెంట్స్ విక్రమ్ మూవీ చూసి కమల్ నటన, ఫహద్ ఫాసిల్ యాక్టింగ్, విజయ్ సేతుపతి విలనిజం ఒక ఎత్తు లోకేష్ కనగరాజ్ టేకింగ్ మరో ఎత్తు, అంతకు మించి అన్నట్టుగా అనిరుద్ మ్యూజిక్, నేపధ్య సంగీతం ఉన్నాయని పొగిడేస్తున్నారు.
కొందరైపోతే అసలు ఓటిటి వరకు ఆగాల్సింది కాదు, ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తే ఆ మజానే వేరు. అనిరుధ్ బీజీఎమ్ ని థియేటర్స్ లోనే చూడాలి బాస్, లోకేష్ కనగరాజ్ ఆ యాక్షన్ సీన్స్ ని ఏం స్టైలిష్ గా ఎలివేట్ చేసాడు, అనవసరంగా థియేటర్స్ ఎక్సపీరియెన్స్ ని మిస్ చేసుకున్నాం అంటూ తెగ ఇదైపోతున్నారు. ఫహద్ ఫాసిల్ భలే గా పెరఫార్మెన్స్ ఇచ్చాడు, కమల్ సర్ సూపర్.. చాలా రోజులకి ఓ మంచి మూవీని చూసాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.