Advertisementt

SSMB28: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

Sat 09th Jul 2022 11:24 AM
mahesh babu,trivikram,ssmb28,ssmb 28 blasting update  SSMB28: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
SSMB28 Blasting update SSMB28: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

మహేష్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ గా మొదలు కాబోయే SSMB 28 అప్ డేట్ వదిలారు. నిన్నటివరకు మహేష్ బాబు వెకేషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. కానీ త్రివిక్రమ్ ఇంకా మహేష్ తో SSMB28 మొదలు పెట్టడడం లేదు. జూన్ లోనే మొదలు కావాల్సిన మూవీ జులై వచ్చినా చప్పుడు లేదు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహేష్ కి నచ్ఛలేదు, అలా వైకుంఠపురములో లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ పై మహేష్ కి నమ్మకం రావడం లేదు.. అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో..

తాజాగా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ SSMB28 అప్ డేట్ సడన్ గా వదిలారు ఈ సినిమాని నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ మేకర్స్. ఆగష్టు నుండి SSMB28 షూటింగ్ మొదలవుతుంది అని, వచ్చే ఏడాది అంటే 2023 సమ్మర్ లో సినిమా రిలీజ్ అంటూ అదిరిపోయే వీడియో తో అప్ డేట్ ఇచ్చేసరికి మహేష్ ఫాన్స్ కూల్ అవడమే కాదు.. హ్యాపీ మోడ్ లోకి వెళుతున్నారు. మాసివ్ ఎపిక్ అండ్ బ్లాస్ట్ యట్ ద స్క్రీన్స్ సమ్మర్ 2023 అంటూ వీడియోతో అప్ డేట్ ని సిద్ధం చేసారు. మరి ఎన్నేళ్ళగానో ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫాన్స్ ఈ న్యూస్ చూడగానే సంబరాలు చేసుకుంటున్నారు.

SSMB28 Blasting update :

Mahesh and Trivikram SSMB28 Crazy update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ