జబర్దస్త్ కమెడియన్ పై బిగ్ బాస్ ఫోకస్

బిగ్ బాస్ సీజన్ 4 లో జబర్దస్త్ అవినాష్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించగా.. అవినాష్ బిగ్ బాస్ లో చాలా ఫన్ చేసాడు. దానితో అప్పట్లో బిగ్ బాస్ కి వ్యూవర్ షిప్ పెరిగింది. కేవలం గ్లామర్, కొట్లాటలు మాత్రమే కాదు, ఫన్ కూడా బిగ్ బాస్ లో ముఖ్యమైనదే. అది ఉంటేనే ఆడియన్స్ బిగ్ బాస్ ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ గత సీజన్ లో బాబా భాస్కర్ బిగ్ బాస్ 5 కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేవరకు బిగ్ బాస్ లో అంతగా ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. కానీ బాబా వచ్చాక హౌస్ లో ఎనెర్జీ కనిపించింది.

అందుకే సీజన్ 6 కి అతిముఖ్యమైన కామెడీ కోసం జబర్దస్త్ లో కామెడీ చేస్తున్న రామ్ ప్రసాద్ ని తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం రామ్ ప్రసాద్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సుధీర్, శ్రీను ను పిలిచినా జబర్దస్త్ కి రారు. ఎందుకంటే వాళ్ళు అంత బిజీ. కానీ రామ్ ప్రసాద్ శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే జబర్దస్త్ లోనే కనిపిస్తున్నాడు, కానీ వేరే బిజీ లేదు. అందుకే భారీ పారితోషకం ఆఫర్ చేసి రామ్ ప్రసాద్ ని బిగ్ బాస్ సీజన్ 6 కి తీసుకొచ్చేసి.. తర్వాత స్టార్ మా లోకి లాగేసేలా ప్లాన్ చేసి మరీ చర్చలు జరుపుతున్నారని టాక్.

Bigg Boss Team Approached Ram Prasad For This Season 6

Bigg Boss Team Approached Ram Prasad?
bigg boss
bigg boss 6
jabardasth
ram prasad