ప్రస్తుతం కెరీర్ డౌన్ లో ఉంది. నిన్నమొన్నటివరకు హీరోయిన్ గా చేతిలో అవకాశాలు ఉన్నాయి. మరోపక్క డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ కి ఇప్పుడు అరకొర అవకాశాలే వస్తున్నాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో అందాలు ఆరబోసినా పని జరగడం లేదు. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే దర్శకుడు విజయ్ ని పెళ్ళాడి.. తర్వాత విడాకులు తీసుకున్న అమలా పాల్ తర్వాత సింగిల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తుంది.
తాజాగా అమలా పాల్ సోషల్లో మీడియాలో ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఓ అభిమాని నేరుగా మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి అంటూ ప్రశ్నించేసరికి.. ఇప్పట్లో నేను మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తెగేసి చెప్పింది. ప్రస్తుతం తనను తాను పూర్తిగా అర్థం చేసుకుని, ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నానంటూ డిఫరెంట్ గా తన పెళ్లిపై స్పందించింది అమలా పాల్. దీనినిబట్టి ఈ హీరోయిన్ ఇంకా పెళ్లి గురించి ఆలోచించకుండా కెరీర్ గురించే ఆలోచిస్తుందన్నమాట.