Advertisementt

షాకింగ్: హీరో విక్రమ్ కి హార్ట్ స్ట్రోక్

Fri 08th Jul 2022 03:15 PM
chiyaan vikram,kaveri hospital,chennai,heart stroke,vikram  షాకింగ్: హీరో విక్రమ్ కి హార్ట్ స్ట్రోక్
Vikram Suffers Heart Attack, Hospitalised షాకింగ్: హీరో విక్రమ్ కి హార్ట్ స్ట్రోక్
Advertisement
Ads by CJ

షాకింగ్ న్యూస్: విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటనతో ప్రేక్షకులని కట్టి పడేసిన జాతీయస్థాయి ఉత్తమ నటుడు విక్రమ్ గుండెపోటుకి గురయ్యారనే వార్త ఒక్కసారిగా కలకలం రేపుతోంది. గతంలో విక్రమ్ కి కరోనా రాగా ఆయన దాని నుండి కోలుకున్నారు. ఈ రోజు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్ వేడుకకి ఆయన హాజరవ్వాల్సి ఉంది. ఈలోపులో హార్ట్ స్ట్రోక్ రావడంతో విక్రమ్ ని వెంటనే చెన్నై లోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉన్నారని, విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 

విక్రమ్ గుండెపోటు వార్త విన్న ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పూజలు చెయ్యడం మొదలు పెట్టారు.

పితామగన్ తో (శివ పుత్రుడు) తో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ ఆపై అపరిచితుడు, ఐ, ఇంకొక్కడు, మజా, నాన్న వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. రీసెంట్ గా తన కొడుకు ధృవ్ తో నటించిన మహాన్ ఓటిటి రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం కోబ్రా, పొన్నియిన్ సెల్వన్ అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. విక్రమ్ నటించిన ప్రతి ఒక్క సినిమా తెలుగులోనూ రిలీజ్ అవడంతో తెలుగులో ఆయనకి విశేషమైన అభిమానులు ఉన్నారు. అందులోను విక్రమ్ తెలుగు వాడే కావడం గమనార్హం. 

Vikram Suffers Heart Attack, Hospitalised:

Chiyaan Vikram Hospitalised in Chennai After Suffering From Heart Stroke

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ