ఏపిలో వైసీపీ ప్లీనరీ గ్రాండ్ గా ప్రారంభమవడమే కాదు.. వైసీపీ ప్లీనరీ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ షాకిచ్చారు. ఈ రోజు వైసీపీ ప్లీనరీ మొదలయ్యేవరకు విజయమ్మ ఈ సభకు రారని, జగన్ తో తల్లికి, చెల్లి షర్మిలకు విభేదాల కారణంగానే విజయమ్మ ఈ సభకు రారంటూ ప్రచారం జరిగినా, వైసీపీ ప్లీనరీలో జగన్ పక్కన విజయమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ ఈ సభ సాక్షిగా ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా తాను వైసీపీ పార్టీ నుండి తప్పుకుంటున్నట్లుగా కొడుకు ముందే ప్రకటించారు. ప్లానింగ్ ప్రకారమే విజయమ్మ పార్టీకి రాజీనామా చేసారని అనిపిస్తుంది. చెప్పాపెట్టకుండా కొడుకు దగ్గర నుండి కూతురు వైపు వెళ్లకుండా.. జగన్ సమ్మతంతో, ప్రజలు, వైసీపీ కార్యకర్తల ముందు విజయమ్మ తన రాజీనామా విషయం ప్రకటించారు.
అదలా ఉంటే విజయమ్మ తన మనస్సాక్షి కోసమే వైసీపీ కి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంటే కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు కొడుకు జగన్ వెంట నడిచాను అని, ఆయన సీఎం అయ్యి సంతోషంగా ఉన్నారు.. ఇప్పుడు కూడా కొడుకు దగ్గరే ఉండడం కరెక్ట్ కాదు, కూతురు షర్మిల ఒంటరి పోరాటం చేస్తుంది. సో ఇకపై తాను షర్మిలకు అండగా ఉంటున్నట్లుగా ఆమె వైసీపీ ప్లీనరీలో ప్రకటించారు. ఇకపై తన కొడుకు జగన్ ని ప్రజల చేతుల్లో పెడుతున్నట్లుగా ఆమె చెప్పారు. తన కొడుక్కి మీరు అండగా ఉండాలని, తన సపోర్ట్ ఎప్పుడూ జగన్ కి ఉన్నా తాను పార్టీలో ఉండి అందరితో విమర్శలు చెయించుకొను అంటూ అంటూ ఆమె చెప్పారు.
తండ్రి ఆశయాల కోసం షర్మిల్ పోరాడుతుంది అని, ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టింది. ప్రస్తుతం తాను ఒంటరి పోరాటం చేస్తుంది. అందుకే తాను ఆమెని సపోర్ట్ చేస్తున్నా అంటూ విజయమ్మ వైసీపీ పార్టీకి రాజీనామాని ప్రకటించారు.