ఒకప్పుడు క్రేజీ హీరోయిన్, లక్కీ హీరోయిన్, స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ఎంతగా అందాలు ఆరబోసినా పని జరగడం లేదు. సోషల్ మీడియాని నమ్ముకుని గ్లామర్ ఫోటో షూట్స్ ని షేర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది కానీ.. అదృష్టం మాత్రం రకుల్ తలుపు తట్టడమే లేదు. ప్రస్తుతం అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్‌లో నటిస్తుంది.
అయితే ఒకప్పుడు ఒక్కో సినిమాకి 1.5 నుండి 2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్న రకుల్ ప్రీత్ కి ఇప్పుడు నిర్మాతలు ఝలక్ ఇస్తున్నారని అంటున్నారు. తెలుగులో అవకాశాల కోసం రకుల్ ప్రీత్ పారితోషకం సాగనికి సగం తగ్గించుకోవడానికి రెడీ అయినా ఆమెవైపు కన్నెత్తి చూసే దర్శకనిర్మాతలెవరూ లేరంటుంటే.. ఇప్పుడు ఆమె రేంజ్ మరింతగా పడిపోయింది అంటున్నారు. రకుల్ పారితోషకం డైలీ పేమెంట్ కి పడిపోయింది అంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. అంటే రోజుకి రెండు నుండి మూడు లక్షల పారితోషకం కింద రకుల్ పని చేస్తుంది అంటున్నారు. మరి ఇది నిజంగా నిజమైతే రకుల్ పని అయిపోయినట్లే..