Advertisementt

మిర్చి కాంబో రిపీట్ అంటున్నారు

Fri 08th Jul 2022 10:07 AM
prabhas,mirchi,ntr30,koratala shiva  మిర్చి కాంబో రిపీట్ అంటున్నారు
Prabhas to team with Koratala Shiva మిర్చి కాంబో రిపీట్ అంటున్నారు
Advertisement
Ads by CJ

రైటర్ గా కథలు రాసే కొరటాల శివ ని నమ్మి ప్రభాస్ ఆయనకి దర్శకత్వం ఛాన్స్ ఇవ్వగా.. కొరటాల ఆ ఛాన్స్ ని అద్భుతంగా మలిచి ప్రభాస్ కి అదిరిపోయే హిట్ అందించారు. ఇప్పటికి ప్రభాస్ ని మిర్చి సినిమాలో చూసేందుకు ఫాన్స్ మాత్రమే కాదు, లేడీస్ చాలా ఇంటరెస్ట్ చూపిస్తారు. అక్కడ కథ, డైరెక్షన్ కన్నా ముఖ్యంగా ప్రభాస్ స్టయిల్, ఆయన లుక్స్ కి చాలామంది ఫ్లాట్ అయ్యిపోయారు. ప్రభాస్ - కొరటాల కలయిక అప్పట్లో అద్భుతాలు సృష్టించింది. ఆ తర్వాత కొరటాల శివ వెనక్కి తిరిగి చూసుకుపోలేదు. ఆయనో టాప్ డైరెక్టర్ గా మారగా.. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 

అయితే ఇప్పుడు మరోసారి మిర్చి కాంబినేషన్ రిపీట్ అంటూ వార్తలొస్తున్నాయి. కొరటాల శివ - ప్రభాస్ మరోసారి కలవబోతున్నారని ప్రచారం స్టార్ట్ అయ్యింది. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో NTR30 మొదలు పెట్టేందుకు రెడీ అవుతుంటే.. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన స్పిరిట్, సిద్దార్థ్ ఆనంద్ మూవీ, మారుతి తో మరో మూవీ చెయ్యాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక కొరటాల లైన్ లోకి వస్తారో.. లేదంటే మధ్యలో యాడ్ అవుతారో కానీ.. ఖచ్చితంగా ప్రభాస్ తో కొరటాల ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి. 

Prabhas to team with Koratala Shiva:

Prabhas to team with Koratala Shiva

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ