Advertisementt

‘వినయ విధేయ రామ’ తర్వాత.. రీ ఎంట్రీ?

Mon 11th Jul 2022 10:39 AM
sneha,vvr,ram charan,vinaya vidheya rama,re entry,actress sneha,tollywood,boyapati  ‘వినయ విధేయ రామ’ తర్వాత.. రీ ఎంట్రీ?
Sneha Re Entry after Vinaya Vidheya Rama ‘వినయ విధేయ రామ’ తర్వాత.. రీ ఎంట్రీ?
Advertisement
Ads by CJ

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన పవర్ ఫుల్ చిత్రం ‘వినయ విధేయ రామ’. వెండితెరపై ఈ చిత్రం ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకున్నప్పటికీ.. బుల్లితెరపై మాత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.. నిలుస్తూనే ఉంది. బుల్లితెరపై ప్రసారమైన ప్రతిసారీ ఈ చిత్రం మంచి టీఆర్పీని రాబట్టుకుంటూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. మరి ఇది రామ్ చరణ్ క్రేజా!, బోయపాటి మ్యాజిక్కా? అనేది పక్కన పెడితే.. ఆ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ సీనియర్ నటి.. ఆ సినిమా రిజల్ట్ తర్వాత మళ్లీ కనిపించలేదు. మళ్లీ ఇంత కాలానికి కనిపించేందుకు రెడీ అవుతోంది. 

 

ఆ సీనియర్ నటి మరెవరో కాదు.. స్నేహ. టాలీవుడ్‌కి మరో సౌందర్యగా పేరు తెచ్చుకున్న స్నేహ.. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత టెలివిజన్ యాడ్స్‌లో మినహా మరే చిత్రంలో కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె సిద్ధమైంది. అందుకోసం, ఆమె గ్లామర్ ఫొటో షూట్స్‌తో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎలా హడావుడి చేస్తుందో తెలియంది కాదు. అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆమె మలయాళంలో మమ్ముట్టి సరసన నటించిన చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ చిత్రంలో అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మీతో పాటు ఆమె కూడా నటించింది. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

 

అలాగే టాలీవుడ్‌లోనూ సరైన అవకాశం కోసం స్నేహ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. మంచి పాత్ర లభిస్తే.. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు స్నేహ సిద్ధంగా ఉందనేలా.. ఆమె సన్నిహిత వర్గాల నుండి తెలుస్తుంది. టాలీవుడ్‌కి చెందిన ఓ టాప్ దర్శకుడు.. ఇటీవల తన చిత్రంలోని ఓ పాత్ర కోసం సంప్రదించినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Sneha Re Entry after Vinaya Vidheya Rama:

Actress Sneha Returns To Films After Ram Charan VVR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ