Advertisementt

విశాల్ ప్రేమలో ఉన్నాడట

Thu 07th Jul 2022 08:55 PM
kollywood,vishal,varalakshmi sarath kumar,aneesha reddy  విశాల్ ప్రేమలో ఉన్నాడట
Vishal is in love విశాల్ ప్రేమలో ఉన్నాడట
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ ఈమధ్యన తరచూ గాయాలపాలవుతున్నారు. షూటింగ్స్ లో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లలో నటించడం, అక్కడ ఆ సీన్స్ లో దెబ్బలు తగిలించుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే కెరీర్ లో ఇలా ఉన్న విశాల్ పర్సనల్ గా వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపి, పెళ్లి వరకు వచ్చాక వారి ప్రేమ బ్రేకప్ అయ్యింది. తర్వాత విశాల్ అనీషా రెడ్డి తో లవ్ అన్నాడు, ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ చివరికి అది కూడా బ్రేకప్ అయ్యింది.

అయితే తాజాగా తనకి పెద్దలు కుదిర్చిన సంబంధాలు అచ్చిరావని, అందుకే లవ్‌ మ్యారేజే చేసుకుంటానని చెబుతున్నాడు. ఇక ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరనే విషయాన్ని బయటికి చెబుతాను అంటూ అందరిని సస్పెన్స్ లో పెట్టేసారు ఆయన. విశాల్ ప్రేమించిన ఆ లక్కీ గర్ల్ ఎవరో అంటూ అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. మరి గతంలో నడిఘర్ సంఘం ఎన్నికల్లో తాను అక్కడ బిల్డింగ్ కట్టించాక అందులోనే వివాహం చేసుకుంటాను అంటూ విశాల్ శపధం కూడా చేసారు.

Vishal is in love:

Kollywood Hero Vishal is in love

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ