Advertisementt

రష్మిక ఛాన్స్ అలా కృతి కొట్టేసింది

Thu 07th Jul 2022 07:42 PM
lingusamy,the warrior event,rashmika,kriti shetty  రష్మిక ఛాన్స్ అలా కృతి కొట్టేసింది
Krithi shetty got chance to act in Ram movie రష్మిక ఛాన్స్ అలా కృతి కొట్టేసింది
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న అంటే లక్కీ గర్ల్ గా హీరోలు ఫిక్స్ అయ్యారు. అందుకే ఆమెకి వరసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాల మీద సినిమాలు చేస్తున్నరష్మిక కి యంగ్ హీరోలు చిన్న హీరోల ఛాన్స్ లు వచ్చినా ఆమె వదులుకోవడం లేదు. అయితే రష్మిక ఇప్పుడొక బైలింగువల్ మూవీ చేజారిపోయినట్టుగా చెబుతున్నారు. తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కిన మూవీ లో ముందు రష్మిక నే హీరోయిన్ అనుకున్నారట. కానీ తర్వాత ఆ ప్లేస్ లోకి వేరే హీరోయిన్ ని తీసుకున్నామని చెప్పడం చూస్తే ఈ భామకి మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అనే చెప్పొచ్చు.

ఇంతకీ రష్మిక కి చేజారిన ఆ సినిమా ఏది అంటే.. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిన ద వారియర్ మూవీలో ముందుగా రష్మిక హీరోయిన్ అయితే బావుంటుంది అని దర్శకుడు లింగుసామి అనుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా తమిళంలో జరిగిన వారియర్ ఈవెంట్ లో ఆయన బయట పెట్టారు. కృతి శెట్టి హీరోయిన్ గా తీసుకోవాలా, ర‌ష్మిక మంద‌న్న ని తీసుకోవాలా అనిఆలోచించాను. కృతిశెట్టి ఫొటో చూడ‌గానే మీరా జాస్మిన్ అంత పేరు తెచ్చుకుంటుంద‌నిపించింది. అందుకే ఈ సినిమాకు కృతి శెట్టి ని బుక్ చేశాను.. అంటూ చెప్పేసరికి అయ్యో రష్మిక ఛాన్స్ కృతి శెట్టి పట్టేసిందిగా అంటున్నారు. 

Krithi shetty got chance to act in Ram movie:

Lingusamy speech at The Warrior event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ