Advertisementt

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతారా?

Thu 07th Jul 2022 04:14 PM
prabhas,adipurush,om raut,adipurush update,rpabhas fans  ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతారా?
Good News for Prabhas fans ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతారా?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస ప్రోజెక్ట్స్ తో ఫాన్స్ కి కిక్ ఇస్తూనే ఉన్నారు. చేతినిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉండడంతో ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ షూటింగ్ ని పారలాల్ గా చేస్తున్న ప్రభాస్ ఓం రౌత్ తో కలిసి ఆదిపురుష్ షూటింగ్ ని ఎప్పుడో ఫినిష్ చేసారు. 30 శాతం షూటింగ్ మిగతా అంతా గ్రాఫిక్ వర్క్ ఉండడంతో ప్రభాస్ తన పార్ట్ షూటింగ్ ని త్వరగా పూర్తి చేసేసి మిగతా సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. 

అయితే ఆదిపురుష్ మూవీ జనవరి 2023 రిలీజ్ అని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ సినిమా నుండి ఒక లుక్కు లేదు, ఓ టీజర్ లేదు, అందుకే ప్రభాస్ ఫాన్స్ చాలా కోపంగా ఉన్నారు. సాహో, రాధే శ్యామ్ చేసిన మాదిరి ప్రమోషన్స్ లేట్ చేస్తే ఇది కూడా దొబ్బిద్ది. ముందు ప్రమోషన్స్ మొదలు పెట్టండి సామి అంటూ ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. శ్రీరామ నవమికి ఏదో ప్రభాస్ లుక్ వస్తుంది అనుకుంటే.. ఫాన్స్ చేసిన ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ వీడియో ఇచ్చి డిస్పాయింట్ చేసారు ఓం రౌత్. అయితే తాజాగా ఆదిపురుష్ టీజర్ ని ప్రభాస్ బర్త్ డే కి కానీ, దసరా కి కానీ వదలాలి అని మేకర్స్ అనుకుంటున్నారట. అందుకే ఈ రెండు నెలలు కూడా కామ్ ఉంటారని, తర్వాత నుండి ఆదిపురుష్ ప్రమోషన్స్ ని పిచ్చెక్కించేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.

Good News for Prabhas fans:

Prabhas Adipurush update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ