Advertisementt

విడిపోయారన్నారు, జంటగా తిరుగుతున్నారు

Thu 07th Jul 2022 12:12 PM
kiara advani,sidharth malhotra,mumbai airport  విడిపోయారన్నారు, జంటగా తిరుగుతున్నారు
Kiara Advani and Sidharth Malhotra Snapped at Mumbai Airport విడిపోయారన్నారు, జంటగా తిరుగుతున్నారు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అక్కడ వరస హిట్స్ తో అందరి చూపు తనపైనే పడేలా చేసుకోలేదు. అమ్మడు ఇచ్చిన గ్లామర్ కిక్ కి అందరూ కియారనే చూసేలా చేసుకుంది. అంతలాంటి గ్లామర్ షో తో కియారా అద్వానీ ఈ మధ్యన తరచూ మీడియా, సోషల్ మీడియాలో హంగామా చేసింది. అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో క్రేజీ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ ఈమధ్యన బాయ్ ఫ్రెండ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో బ్రేకప్ చేసుకుంది, అందుకే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు, ఇద్దరి మధ్యన వచ్చిన అభిప్రాయభేదాలు వారు విడిపోవడానికి కారణం అంటూ ప్రచారం జరిగింది.

ఈ విషయం సిద్దార్థ్ కానీ, కియారా అద్వానీ కానీ ఎక్కడా స్పష్టత నివ్వలేదు. మీడియా ప్రశ్నించినా కియారా దానిని దాటవేసింది కానీ జవాబు చెప్పలేదు. ఇక కియారా అద్వానీ - సిద్దార్థ్ ప్రేమలో ఉండగా వెకేషన్స్ కి, జాలి ట్రిప్స్, అలాగే అవార్డు ఫంక్షన్స్ కి కలిసే తిరిగేవారు. అయితే ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాలు జంటగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఔరా విడిపోయారన్నారు, కలిసే తిరుగుతున్నారు. అంటే వీరిమధ్యన బ్రేకప్ అవ్వలేదు హమ్మయ్య అంటూ వాళ్ళ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Kiara Advani and Sidharth Malhotra Snapped at Mumbai Airport:

Kiara Advani and Sidharth Malhotra shared an adorable moment at the Mumbai airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ