Advertisementt

ప్రభాస్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?

Thu 07th Jul 2022 11:05 AM
kareena kapoor khan,prabhas,sandeep reddy vanga,spirit  ప్రభాస్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
Kareena Kapoor Khan to romance with Prabhas ప్రభాస్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టడమే కాదు, ఆ సినిమాల షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. ఇక సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ ఫినిష్ అయితే సందీప్ వంగతో తో స్పిరిట్ మూవీ చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాత సిద్దార్థ్ ఆనంద్, మారుతి చిత్రాలు ఉన్నాయి. అయితే ఆదిపురుష్ లో ప్రభాస్ కృతి సనన్ తో రొమాన్స్ చేసారు. సలార్ లో శృతి హాసన్ తో ప్రభాస్ కలిసి నటిస్తున్నారు.

ఇక ప్రాజెక్ట్ కె లో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, దిశా పటానీలతో వర్క్ చేస్తున్నారు ప్రభాస్. ఇక సందీప్ రెడ్డి వంగా చిత్రంలో ప్రభాస్ పోలీస్ కేరెక్టర్ లో నటించబోతున్నారు. ఈ సినిమాకి కూడా హీరోయిన్ ఫిక్స్ అంటున్నారు. అదే బాలీవుడ్ బెబో కరీనా కపూర్. కరీనా కపూర్ ఖాన్ ప్రభాస్ సరసన స్పిరిట్ లో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ తో కలిసి నటించడానికి కరీనా కపూర్ భారీగా డిమాండ్ చేసింది అనే ప్రచారం ఉంది. ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండి రెమ్యునరేషన్ అంత డిమాండా అంటే.. క్రేజ్ ఉంది కాబట్టే అడుగుతున్నాను అంటూ కరీనా స్పిరిట్ మేకర్స్ కి చెప్పినట్లుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ కి సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తుంది.

Kareena Kapoor Khan to romance with Prabhas:

Kareena Kapoor Khan to romance with Prabhas in Sandeep Reddy Vanga Spirit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ