బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో క్రేజి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 మూవీ బాలయ్యకి కరోనా రావడంతో వాయిదా పడింది. బాలయ్య కరోనా నుండి పూర్తిగా కోలుకోవడంతో తదుపరి షెడ్యూల్ కోసం గోపీచంద్ మలినేని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బాలకృష్ణ అండ్ టీం ఈ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ అమెరికా వెళ్లేందుకు యూనిట్ లో చాలామందికి వీసాలు ప్రాబ్లెమ్ రావడంతో అమెరికా షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది. క్యాన్సిల్ అంటే అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసి టర్కీ కి వెళ్ళబోతున్నారట NBK107 టీం.
అమెరికా షెడ్యూల్ లో జరగాల్సిన షూటింగ్ ని టర్కీ లో ఫినిష్ చెయ్యబోతున్నారు. అక్కడే ఓ 20 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారట. ఈ షెడ్యూల్ లోనే రెండు పాటలతో పాటు, ఓ యాక్షన్ సీన్ ని కూడా పూర్తి చెయ్యబోతున్నారు.. అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పాల్గొనబోతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కన్నడ దునియా విజయ్ బాలయ్యని ఢీ కొట్టబోయే విలన్ గా కనిపిస్తున్నారు. ఇక బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది.