పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్(సాలా క్రాస్‌బ్రీడ్). తాజాగా చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. లైగర్ ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ప్రోమోని జూలై 8న విడుదల చేసి, పూర్తి పాటని 11న రిలీజ్ చేయనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్ విజయ్ దేవరకొండ తన చేత్తో అనన్య చేత విజల్ కొట్టించేలా చూపించడం అలరించింది. ఈ పార్టీ సాంగ్ పెప్పీ నెంబర్ గా వుండబోతుంది. విజయ్ దేవరకొండ రెడ్ బ్లేజర్‌లో కనిపిస్తుండగా, అనన్య బ్లాక్ అవుట్ ఫిట్స్ లో మెరుస్తోంది. పబ్ సెట్‌లో ఈ పాట చిత్రీకరించారు.
లైగర్ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషనల్ మెటిరియల్ తో ఈ చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.