మల్లెమాల వారు ఈటీవీలో జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు సుధీర్, అభి, రాఘవ, ధనరాజ్, వేణు లాంటి వాళ్ళు కమెడియన్స్ గా జబర్దస్త్ స్టేజ్ ఎక్కారు. తర్వాత వారు జబర్దస్త్ కారణంగానే సెటిల్ అయ్యి ఇల్లు కొనుక్కుని, కార్లను కొనిక్కుని ఎంజాయ్ చేస్తున్న విషయం వారే చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కిరాక్ ఆర్పీ మాత్రం మా టాలెంట్ ని వాడుకున్నారు. మాకు పారితోషకాలు ఇచ్చారు, మల్లెమాల వాళ్ళు దేవుళ్ళేమి కాదు, చీప్ రకమైన ఫుడ్ పెట్టేవారు. మాకేమి లేదు, మేము అడుక్కునేవాళ్లమని వాళ్ళ ఫీలింగ్, నాగబాబు బాబు గారే మాకు అన్నం పెట్టారు. ఆయనే మంచి చేసారు. అని జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళినప్పుడే ఆర్పీ మాట్లాడాడు.
తాజాగా మల్లెమాల వాళ్ళు తమ దగ్గర పనిచేసే వారిని చాలా చులకనగా చూస్తారు, అక్కడ డైరెక్టర్స్ వలనే మేము పైకి వచ్చాం, పెట్టుబడి ఎవరైనా పెడతారు, నాగబాబు గారు కూడా డబ్బులు పెడతారు, నాకు నాగబాబు గారితో ఉన్న అనుబంధం, రొజా గారితో లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర తన సినిమాలో పని చేసే ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ వచ్చేలా చూస్తారు. కానీ మల్లెమాల వాళ్ళు అలాకాదు.. అంటూ మల్లెమాల పేరు తియ్యకుండానే జబర్దస్త్ సంస్థ అంటూ ఆర్పీ సెన్సేషనల్ గా మాట్లాడారు. కార్లు, ఇల్లు కొనుక్కుని ఆనందంగా ఉన్నారనగానే అవును మేము కష్టపడ్డాం, అందుకే డబ్బు ఇచ్చారు, జబర్దస్త్ నుండి బయటకి వచ్చాక కూడా హ్యాపీగా ఉన్నాను అంటూ మరోసారి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ జబర్దస్త్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.