Advertisementt

విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది

Wed 06th Jul 2022 03:46 PM
vijay sethupathi,villain,shah rukh khan,atlee,jawan  విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది
Vijay Sethupathi to play villain in Jawan విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సుకుమార్ - అల్లు అర్జున్ పుష్ప 2 లో నటించబోతున్నారని, ఫహద్ ఫాసిల్ పోలీస్ కేరెక్టర్ తో పాటు అల్లు అర్జున్ విజయ్ సేతుపతి తోనూ తలపడతాడని, సుకుమార్ ఇప్పటికే విజయ్ సేతుపతి ఒప్పించాడంటూ హడావిడి చేస్తున్నారు. ప్రముఖ తమిళ వెబ్ సైట్స్ లో ఈ న్యూస్ రావడంతో అందరూ విజయ్ పుష్ప 2 లో ఉన్నారని ఫిక్స్ అవుతున్నారు. ఇంతలోపే విజయ్ సేతుపతి పేరు జవాన్ మూవీ కోసం వినిపిస్తుంది.  

బాలీవుడ్ లో షారుక్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ జవాన్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలయ్యింది. అయితే షారుఖ్ తో పోటీపడే పవర్ ఫుల్ విలన్ రోల్ ఉంది అని, అట్లీ ఆ రోల్ ని విజయ్ సేతుపతి చేస్తే బావుంటుంది అని, అందుకే విజయ్ సేతుపతి సంప్రదించేపనిలో అట్లీ ఉన్నారని తెలుస్తుంది. గతంలోనే విజయ్ సేతుపతికి బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. కానీ విజయ్ మిస్ చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం పక్కా అంటున్నారు.

Vijay Sethupathi to play villain in Jawan:

Vijay Sethupathi to play villain in Shah Rukh Khan and Atlee Jawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ