అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు లో విడుదల అంటూ మేకర్స్ ఎప్పుడో ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మధ్యలో చిన్న చిన్న కారణాలతో ఏజెంట్ షూటింగ్ లేట్ అవడంతో ఏజెంట్ అనుకున్న డేట్ కి రాకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏజెంట్ డేట్ మార్పు అంటూ వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఏజెంట్ టీం మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.
అతి త్వరలోనే ఏజెంట్ టీజర్ రిలీజ్ చేసి ఏజెంట్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. తాజగా ఏజెంట్ టీజర్ కట్ ఫినిష్ అయ్యింది అని, ఎడిటింగ్ కూడా పూర్తి చేసారని తెలుస్తుంది. ఏజెంట్ టీజర్ 1 నిమిషం 15 సెకన్ల పాటు ఉండబోతుంది అని, ఈ టీజర్ లో అఖిల్ మేకోవర్ తో పాటుగా, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని, అలాగే రెండు పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండేలా టీజర్ కట్ చేసారని, మలయాళ హీరో మమ్ముట్టి ఈ టీజర్ లో హైలెట్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. హిప్‌హాప్ తమిజా బీజీఎం, రసూల్ సినిమాటోగ్రఫీ కూడా ఈ టీజర్ కి హైలెట్స్ గా నిలవబోతున్నాయని తెలుస్తుంది.