Advertisementt

విజయ్ దేవరకొండ సినిమాలో రష్మిక స్పెషల్

Tue 05th Jul 2022 09:48 PM
rashmika mandanna,vijay deverakonda,jgm,jana gana mana,puri jagannadh  విజయ్ దేవరకొండ సినిమాలో రష్మిక స్పెషల్
Rashmika Mandanna special in JGM? విజయ్ దేవరకొండ సినిమాలో రష్మిక స్పెషల్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ ముగించేసి శివ నిర్వాణ తో ఖుషి సినిమా, పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోనే జన గణ మన మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేందుకు టీం రెడీ అవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఖుషి లోని కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసి JGM  షూటింగ్ కి వచ్చేసాడు. ఖుషి లో సమంత తో రొమాన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక జన గణ మన లో పూజ హెగ్డే తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 

JGM లోను, ఖుషిలోను విజయ్ లుక్స్ కి చాలా దగ్గర పోలికలు ఉండడంతో విజయ్ దేవరకొండ రెండు ప్రాజెక్ట్స్ ని పారలల్ గా చేస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ స్నేహితురాలు, నేషనల్ క్రష్ రష్మిక JGM లో ఓ స్పెషల్ రోల్ చెయ్యబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ - రశ్మికల జోడికి మంచి క్రేజ్ ఉంది. అందుకే పూరి జగన్నాధ్ రష్మిక ని JGM కోసం ఎంపిక చేసారని తెలుస్తుంది. అయితే రశ్మికది JGM లో స్పెషల్ రోలా లేదంటే స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

Rashmika Mandanna special in JGM?:

Rashmika Mandanna special Vijay Deverakonda in JGM?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ