సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఉత్త సుధీర్ గా మారిపోయాడు. అంటే జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ గా పాపులర్ అయిన సుధీర్ జబర్దస్త్ నుండే కాదు ఢీ డాన్స్ షో నుండి తప్పుకున్నాడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి మెల్లగా సైడ్ అయ్యాడు. ఇక సినిమాల్లో హీరోగా కనిపిస్తాడనుకుంటే స్టార్ మా ప్రోగ్రామ్స్ అంటూ జీ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ అంటూ బిజీ అయ్యాడు. కాకపోతే ఈటివి నుండి వచ్చెయ్యడం ఆయన ఫాన్స్ కి నచ్చలేదు, వాళ్ళు ఫీలవుతున్నా అధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సుధీర్ ని స్టార్ మా లాగెసింది అని చెప్పుకుంటున్నారు. సుధీర్ వెళ్లిపోయాడని రామ్ ప్రసాద్ జబర్దస్త్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకోగా.. జేడ్జ్ ప్లేస్ లో ఉన్న ఇంద్రజ వెక్కి వెక్కి ఏడ్చింది.
అయితే తాజాగా ఇంద్రజ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడంటే నమ్మబుద్ది కావడం లేదు అని, ఎందుకంటే మా ఇద్దరిదీ తల్లీకొడుకుల బాండింగ్, నేను నాన్నా అంటాను, సుధీర్ అమ్మా అంటూ పిలుస్తాడు. మా ఇద్దరికి మధ్యన ఎనిమిదేళ్ల గ్యాప్ మాత్రమే అయినా.. అమ్మా అని పిలిచిన సుధీర్ అంటే చాలా ఇష్టం, సుధీర్ లేని లోటు జబర్దస్త్ లో కనబడుతుంది. సుధీర్ ని బాగా మిస్ అవుతున్నా అంటూ ఇంద్రజ ఆ ఇంటర్వ్యూలో బాగా ఎమోషనల్ అయ్యింది.