సీనియర్ నరేష్ మూడు పెళ్లిళ్లు ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఆయన మొదటి భార్య డెలివరీ టైం లో హిస్టీరియా పేషేంట్ అవడంతో ఆయన సెకండ్ మేరేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నరేష్ షూటింగ్స్ లో బిజీగా ఉండడంతో ఆ పెళ్లి విడాకులకు దారితియ్యగా.. నరేష్ కాంగ్రెస్ నేత రఘువీరా అన్న కూతురు రమ్య రఘుపతి ని వివాహం చేసుకున్నారు. ఆతర్వాత రెండేళ్లకే రమ్యకి నరేష్ కి మధ్యలో విభేదాలు రావడంతో ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నారు అంటూ ప్రొడ్యూసర్ చిట్టి బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడమే కాదు, రమ్య నరేష్ పేరు చెప్పి చీటీలు వేసి ఎగ్గొట్టడం, అలాగే అందరి దగ్గర అప్పులు చేసి ఇంటి మీదకి తేవడం వంటివి చేసేది అని, అలా చాలా లక్షలు సెటిల్మెంట్ చేసారని, నరేష్ ఆమెతో విసిగిపోయాడని చిట్టిబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
రమ్య తో రెండేళ్లకే విడిపోయిన నరేష్ ఎవరికి వారే విడి విడిగా ఉంటున్నారని, నరేష్ తల్లి విజయ్ నిర్మల గారు కూడా రమ్య విషయంలో విసిగిపోయారని, కొంతడబ్బు సెటిల్మెంట్ చేసి.. ఇలాంటివి ఇంటి మీదకి వస్తే పరువు పోతుంది అంటూ ఆమె బాధపడ్డారని, ఈ విషయం అందరికి తెలుసు అన్నారు. అలాగే రమ్య డ్రైవర్ తో ఎఫ్ఫైర్ పెట్టుకుంది అని నరేష అంటున్నారని యాంకర్ అడగగా.. చిట్టిబాబు ఆ విషయం క్లారిటీ లేదు కానీ, డబ్బు విషయం తెలుసు. అయితే భర్త కావాలి, ఆయనతోనే ఉంటాను అన్న ఆవిడ ఇలా టీవీలలో డిబేట్స్ పెట్టడం ఏమిటి? అసలు రమ్య మళ్ళీ లైన్ లోకి రావడం వెనుక జనవరిలో ఆమెకి నరేష్ విడాకుల నోటీసులు పంపించారు. కానీ రమ్య కి నరేష్ ఆస్తిపై కన్ను పడింది.
ఒకప్పుడు నరేష్ ఆస్తుల లెక్కలు వేరు, ఇప్పుడు ఆయన తల్లి ఆస్తి, రియల్ ఎస్టేట్ అన్నీ బాగా పెరిగిపోయి 1000 కోట్ల ఆస్తి ఉంది అనేసరికి రమ్య మరోసారి నరేష్ పై విమర్శలు చేస్తూ మొగుడు కావాలంటూ మీడియా కి ఎక్కింది అంటూ చిట్టి బాబు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.