మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా ఫాన్స్ కి పూనకాలే. కొద్దిరోజులు సినిమాలకి దూరమైనా మళ్ళీ చాలా ఏళ్ళకి సినిమాల్లోకి కం బ్యాక్ అయిన చిరుని ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. అయితే చిరు రీసెంట్ మూవీ ఆచార్య ఫాన్స్ ని డిస్పాయింట్ చేసినా ఆయన కొత్త మూవీ గాడ్ ఫాదర్ ఫాన్స్ కి న్యాయం చేస్తుంది అనడంలో ఫస్ట్ లుక్ చూసాక సందేహమే లేదు అంటున్నారు. గాడ్ ఫాదర్ గా చిరంజీవి లుక్, ఆయన స్టయిల్ అన్ని అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాయి. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ కార్డ్స్ లో Chiranjeevi అని ఉండాల్సిన పేరులో Chiranjeeevi అని ఉంది. అంటే చిరు న్యూమరాలజిస్ట్ సలహా మేరకు రెండు EE లు ఉండాల్సిన చోట మరో E తగిలించుకున్నారా అనే అనుమానం నెటిజెన్స్ లో మొదలైంది.
MEGASTAR CHIRANJEEVI అని ఉండాల్సిన పేరులో MEGASTAR CHIRANJEEEVI అని కనిపించేసరికి చిరు పేరు మార్చేసుకున్నారని చాలామంది అనుకుంటుంటే.. కాదు టైటిల్ కార్డ్స్ లో ఎడిటర్ చేసిన తప్పిదం వలన మూడో E పడింది. అంతేకాని చిరు ఎలాంటి పేరు మార్చుకోలేదు అంటూ కొందరు వాదిస్తున్నారు. ఆ వీడియో, పోస్టర్ రిలీజ్ చేసే హడావిడిలో ఎవరూ మూడో E ని గమనించలేదు అంటూ చిరు పేరు మార్పు న్యూస్ లని కొట్టిపారేస్తున్నారు.