ప్రస్తుతం సమంత కెరీర్ ని చాలా జాగ్రత్తగా కాదు, గ్లామర్ గా ప్లాన్ చేసుకుంటుంది. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసినప్పటినుండి సమంత చూపు బాలీవుడ్ మీదే ఉంది. అందుకే ముంబై లో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే ఉండడానికి ఫిక్స్ అయ్యింది. మధ్యలో విడాకులతో కొద్దిగా సఫర్ అయిన సమంత ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతుంది. యశోద, శాకుంతలం మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. సల్మాన్ ఖాన్ తో సమంత త్వరలోనే బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ నడుస్తున్న సమయంలో హీరోయిన్ తాప్సి సమంత తో మూవీ చెయ్యడానికి రెడీ అయ్యింది.
తాప్సి తాజాగా ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ప్రాజెక్ట్ పై విషయమై క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ లో విమెన్ సెంట్రిక్ మూవీస్ తో సత్తా చాటుతున్న తాప్సి కొత్త నిర్మాతగానూ మరింది. తన బ్యానర్ లోనే సమంత హీరోయిన్ గా ఓ సినిమా చేయబోతున్నట్లుగా చెప్పిన తాప్సి స్టోరీ డిమాండ్ మేరకు ఏదైనా రోల్ ఉంటే నేను కూడా యాక్ట్ చేస్తా అని చెబుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. సమంతతో కలిసి సినిమా చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా అంటూ తాప్సి ఆ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రస్తుతం తాప్సి క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తుంది.