అల్లు అర్జున్ పుష్ప.. పుష్ప రాజ్ అంటూ పాన్ ఇండియా మార్కెట్ ని ఊపేసారు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబో హిందీలో పుష్ప సినిమాతో 100 కోట్ల క్లబ్బులో అడుగుపట్టి హౌరా అనిపించారు. అందుకే పుష్ప 2 పై నార్త్ ప్రేక్షకుల్లోనూ, సౌత్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ లో పుష్ప 1 రిలీజ్ అయితే.. పుష్ప 2 ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నారు. కానీ ఇంతవరకు పుష్ప 2 షూటింగ్ మొదలవ్వలేదు. ఆగష్టు నుండి పుష్ప 2 సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు.
ఈలోపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఓ ట్రిప్ వేసేసారు. అది కూడా టాంజానియా దేశానికి తన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు ఆయన్, అర్హలతో వెకేషన్స్ కి కాస్త సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తూ వెళ్లినా అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా టాంజానియా దేశంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ వైట్ అండ్ వైట్ డ్రెస్సుల తో మెరిసిపోతున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ వైట్ షార్ట్, టి షర్ట్ తో కనిపిస్తే స్నేహ వైట్ డ్రెస్ లో కనిపించింది. ఇక అల్లు అర్హ, అయాన్ లు వైట్ టాప్స్ తో క్యూట్ గా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా వైట్ అండ్ వైట్ లో మెరిసిపోతుంది.