సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు వరస సినిమాలతో పోటీ పడుతున్నారు. చిరంజీవి చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బాలయ్య చేతిలో రెండు, వెంకీ ఇంకా కొత్త సినిమా ప్రకటించలేదు. రానా - నాయుడు వెబ్ సీరీస్ కూడా ముగించేశారు. నాగార్జున ద ఘోస్ట్ షూటింగ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు సీనియర్ హీరోల్లో పోటాపోటీగా ఉన్న బాలయ్య - చిరు లు బ్లాక్ డ్రెస్ తో కేక పుట్టిస్తున్నారు. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో క్రేజీ మూవీ గా తెరకెక్కుతున్న NBK107 మూవీ కోసం ఫస్ట్ టైం బాలకృష్ణ బ్లాక్ షర్ట్ వేసి లుంగీ కట్టారు. ఆ లుక్ అదిరిపోయింది. మీసకట్టు, కొద్దిగా నెరిసిన హెయిర్ స్టయిల్ తో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య లుక్ ఫాన్స్ కే కాదు, ప్రేక్షకులందరికీ తెగ నచ్చేసింది.
ఇక తాజాగా చిరంజీవి కూడా బ్లాక్ డ్రెస్ తోనే దిగిపోయారు. అది కూడా గాడ్ ఫాదర్ మూవీ కోసం గాడ్ ఫాదర్ లో చిరంజీవి బ్లాక్ కుర్తా పైజామాలో కనిపిస్తున్నారు. కారులో నుండి స్టయిల్ గా బయటికి దిగిన చిరు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయారు. కానీ హెయిర్ లో అక్కడక్కడా వేసిన తెల్లరంగు కొద్దిగా ఇబ్బంది పెట్టేదిలా ఉంది. అయితే అటు బాలయ్య, ఇటు చిరు ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లు వేసి పోటీ పడిన ఫీలింగ్ నందమూరి - మెగా ఫాన్స్ లో అయితే వచ్చేసింది. అందుకే బాలయ్య NBK107 లుక్ ని, చిరు గాడ్ ఫాదర్ లుక్ ని షేర్ చేస్తూ ఎవరిది బెస్ట్ లుక్కో చెప్పమంటూ సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేసారు.