Advertisementt

నయనతార నువ్ సూపర్ అంతే

Tue 05th Jul 2022 10:12 AM
nayanthara,chennai,mumbai airport,vignesh shivan,javan movie,sharukh  నయనతార నువ్ సూపర్ అంతే
Nayanthara spotted at Mumbai Airport నయనతార నువ్ సూపర్ అంతే
Advertisement
Ads by CJ

నయనతార నువ్ సూపర్ అంతే అంటూ ఆమె అభిమానులు ఒకటే భజన చేస్తున్నారు. కారణం ఏం లేదు. నయనతార రీసెంట్ గానే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. మరి హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న మూడో రోజే మంగళ సూత్రం ఫ్రిజ్ లో పెట్టి షూటింగ్స్, హానిమూన్స్ కి వెళ్లిపోతుంటారు. రీసెంట్ గా అలియా భట్ అయితే పెళ్ళైన మూడో రోజే చేతులకి గాజులు కానీ, మేడలో మంగళ సూత్రం కానీ లేకుండానే షూటింగ్స్ కి వెళ్ళిపోయింది. అప్పట్లో అలియా భట్ నెటిజెన్స్ చేతిలో ట్రోల్ అయ్యింది.

అయితే నయనతార మాత్రం పెళ్ళై నెల గడుస్తున్నా ఇంకా మంగళ సూత్రం తోనే కనబడుతుంది. హనీమూన్ లోనే మంగళ సూత్రం తో కనిపించిన నయన్ ని ఆమె సంసృతి సాంప్రదాయాలకు విలువనిస్తుంది అన్నారు. హనీమూన్ ముగించుకుని చెన్నై వచ్చిన నయనతార అటునుండి అటే ముంబై లో జరుగుతున్న జవాన్ షూటింగ్ కి వెళ్ళిపోయింది. షారుఖ్ ఖాన్ - అట్లీ కలయికలో వస్తున్న జవాన్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలోనే జరుగుతుంది. దానికోసమే నయనతార ముంబై వెళ్ళింది. రీసెంట్ గా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని నయనతార ముంబై నుండి చెన్నైకి బయలు దేరింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో నయనతార మోడ్రెన్ లుక్ లో బ్లాక్ ఔట్ ఫిట్ లో ఎంతో గ్లామరస్ గా కనిపించినా మెడలో మంగళ సూత్రం తో నయన్ స్పెషల్ గా కనిపించేసరి ఆమె ఫాన్స్ నయన్ నువ్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఎంత సెలెబ్రిటీ అయినా వివాహబంధానికి నయన్ ఇచ్చే విలువ వేరే లెవల్ అంటూ పొగిడేస్తున్నారు.  

Nayanthara spotted at Mumbai Airport:

Nayanthara returns from Chennai, gets clicked at Mumbai airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ