షణ్ముఖ్ అంటే యూట్యూబ్ ని ఫాలో అయ్యేవారికి, సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి బాగా పరిచయం ఉన్నపేరు. ఇక బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకి బాగా రిజిస్టర్ అయ్యాడు. యూట్యూబ్ లో షణ్ముఖ్ జాస్వంత్ హీరో. అతనికి కోట్లలో వ్యూస్, లైక్స్. అందుకే అతనికి విపరీతమైన క్రేజ్, సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సీరీస్ లతో కోట్లలో అభిమానులని సంపాదించుకున్న షణ్ముఖ్ ని ఓ రోడ్ యాక్సిడెంట్ ఇబ్బంది పెట్టింది. ఆ మచ్చ పోగొట్టుకోవడానికో, పారితోషకానికి పడిపోయో.. బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ కూడా గట్టిగా ఇరుక్కుపోయాడు. సిరి ఫ్రెండ్ షిప్ అతని ఇమేజ్ ని బిగ్ బాస్ లో డ్యామేజ్ చేసింది.
భారీ పారితోషకం తో పాటుగా అంతే భారీ స్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ తో షణ్ముఖ్ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక గర్ల్ ఫ్రెండ్ ని కోల్పోయాడు. బిగ్ బాస్ వలన అతని ప్రేమని కోల్పోయాడు. ఆ తర్వాత వర్క్ లో బిజీ అయ్యాడు. ఆహా ఓటిటి కోసం ఓ వెబ్ సీరీస్ చేసాడు. ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సీరీస్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు షణ్ముఖ్. షణ్ముఖ్ కి ఉన్న క్రేజ్ చూసిన ఆహా వారు షణ్ముఖ్ కి అధిక పారితోషకం ఇచ్చి ఈ సీరీస్ చేయించినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ సిరీస్ కి షణ్ముఖ్ కి 50 లక్షలు ముట్టినట్లుగా సమాచారం. ఫుల్ కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఈ వెబ్ సీరీస్ ఫస్ట్ లుక్ తోనే షణ్ముఖ్ అంచనాలు పెంచేసాడు. ఈ సీరీస్ గనక హిట్ అయితే మళ్ళీ షణ్ముఖ్ రేంజ్ పెరగడం మాత్రం ఖాయం.