మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ ని కేవలం పోస్టర్ తోనే కాదు, ఓ వీడియో తో డిఫరెంట్ గా వదిలారు. మెగాస్టార్ చిరు ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారన్నది అందరికి తెలిసిన విషయమే. గాడ్ ఫాదర్ గా చిరు ని ఇప్పటికే టైటిల్ పోస్టర్ లో బ్లాక్ డ్రెస్ లో చూసాం. ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ వీడియో లో పార్టీ కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా.. వారి మద్యనుండి మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో వచ్చారు. డ్రైవర్ కార్ డోర్ తియ్యగా మెగాస్టార్ కారునుండి దిగి హుందాగా లోపలి వెళుతున్న లుక్ అది.
ఆ లుక్ లో చిరంజీవి బ్లాక్ డ్రెస్ లో లాల్చీ పైజామాలో చాలా డీసెంట్ గా హుందాగా కనిపిస్తున్నారు. గాడ్ ఫాదర్ అనే టైటిల్ చిరు లుక్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఉంది, చిరు లుక్ తో మెగా ఫాన్స్ ఫుల్ హ్యాపీ. ఆచార్య గా చిరు ని చూసి డిస్పాయింట్ అయిన ఫాన్స్ గాడ్ ఫాదర్ లుక్ లో చిరుని చూసి ఖుషి అవుతున్నారు. ఇక గాడ్ ఫాదర్ కి మరిన్ని స్పెషల్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా నయనతార చిరు కి సిస్టర్ గాను, సల్మాన్ ఖాన్ చిరు కి బాడీ గార్డ్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించేసారు.