రామ్ చరణ్ - శంకర్ కలయికలో 3 లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న RC 15 లుక్ పై ఫాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ తన RC 15 మేకోవర్ ని చూపించి చూపించనట్టుగా చూపిస్తూ RC15 చరణ్ లుక్ లోడింగ్ అంటూ అప్ డేట్ ఇచ్చారు. దానితో మెగా ఫాన్స్ లోనే కాదు, అటు శంకర్ సినిమాలను అభిమానించేవాళ్ళు కూడా ఈ లుక్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వైజాగ్ షెడ్యూల్ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన RC15 యూనిట్ మళ్ళీ అమృత్‌సర్ కి పయనమైంది. అక్కడ సినిమాలోని ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
శంకర్ సినిమాలోని సాంగ్స్ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన పాటల విషయంలో అంత కేర్ తీసుకుకోవడమే కాదు, ఆ సాంగ్స్ కి భారీగా ఖర్చు పెట్టి స్పెషల్ సెట్స్ వేయిస్తారు. ఆ పాటలు కూడా అంతే హిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు RC 15 లో కూడా రామ్ చరణ్ 400 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లతో కలిసి షూట్ లో పాల్గొంటున్నారు. ఈ సాంగ్ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో తెరకెక్కుతుంది. ఈ సాంగ్ కోసం శంకర్ అమృత్‌సర్‌లో విలాసవంతమైన సెట్ వేయించినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ సరసన గ్లామర్ భామ కియారా అద్వానీ నటిస్తుంది. కియారా కూడా ఈ సాంగ్ షూట్ లో పాల్గొనబోతుంది.