మహేష్ బాబు లాంగ్ వెకేషన్స్ ని పూర్తి చేసుకుని రీసెంట్ గానే ఫ్యామిలీతో హైదరాబాద్ లో అడుగుపెట్టారు. యూరప్ మరియు అమెరికా దేశాలని చుట్టేసిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో SSMB28 రెగ్యులర్ షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన మరోసారి పూజ హెగ్డే నటించబోతుంది. అయితే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారని, ఇంకా విజయ్ సేతుపతి, పృద్వి రాజ్ సుకుమారన్, ఉపేంద్ర కానీ నటించే ఛాన్స్ ఉంది అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ కి యంగ్ ఫాదర్ గా ఒకరు నటించబోతున్నారట.
ఆయనే కన్నడ నటుడు ఉపేంద్ర. మహేష్ బాబు కి యంగ్ ఫాదర్ గా, ఫ్రెండ్లీ ఫాదర్ గా కనిపిస్తారని అది కూడా మహేష్ బాబు చిన్న తనంలోనే అంటే ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లోనే ఉపేంద్ర ఎపిసోడ్ ఉంటుంది కానీ, మహేష్ బాబు పెరిగిన తర్వాత ఉపేంద్రతో ఎలాంటి సీన్స్ ఉండవంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆల్మోస్ట్ ఉపేంద్రనే మహేష్ కి ఫాదర్ గా ఫిక్స్ అని, త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది.