Advertisementt

అప్పుడు మిస్ అయినా ఈసారి పుష్ప2 లో పక్కా

Mon 04th Jul 2022 11:38 AM
vijay sethupathi,pushpa 2,sukumar,allu arjun,pushpa the rule  అప్పుడు మిస్ అయినా ఈసారి పుష్ప2 లో పక్కా
Vijay Sethupathi in Pushpa 2 అప్పుడు మిస్ అయినా ఈసారి పుష్ప2 లో పక్కా
Advertisement
Ads by CJ

పుష్ప స్టార్ట్ చేసిన సమయంలో దర్శకుడు సుకుమార్ విజయ్ సేతుపతిని విలన్ గా ఫైనల్ చేసుకుని సెట్స్ మీదకి వెళ్లారు. మధ్యలో కొద్దిగా గ్యాప్ రావడం, తర్వాత ఏం జరిగిందో విజయ్ సేతుపతి పుష్ప నుండి తప్పుకున్నారు. విజయ్ సేతుపతి అయితే ఆ రోల్ కి మైలేజ్ వస్తుంది. ముఖ్యంగా తమిళంలో పుష్ప కి క్రేజ్ వస్తుంది అని సుకుమార్ భావించినా ఆయన తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ ని తీసుకువచ్చారు. అయితే విజయ్ సేతుపతి పుష్ప కేరెక్టర్ నచ్చకే ఆయన బయటికి వచ్చారనే ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం మరోసారి సుకుమార్ మరోసారి విజయ్ సేతుపతిని సంప్రదించారని, విజయ్ సేతుపతి కూడా సుకుమార్ అడగ్గానే ఒప్పుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఫహద్ ఫాసిల్ తో పాటుగా విజయ్ సేతుపతిని పవర్ ఫుల్ విలన్ గా పార్ట్ 2 లో చూపించేందుకు సుకుమార్ స్కెచ్ వేశారని అంటున్నారు. అల్లు అర్జున్ తో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతిలు తలపడబోయే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి పుష్ప పార్ట్ 1 లో మిస్ అయినా పుష్ప పార్ట్ 2 లో విజయ్ సేతుపతి పక్కా అంటున్నారు.

Vijay Sethupathi in Pushpa 2:

Vijay Sethupathi on the board for Pushpa 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ