ఈ రోజు సోమవారం. ఈ రోజుకి టాలీవుడ్ లో చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరు దగ్గర నుండి కళ్యాణ్ రామ్ వరకు తమ సినిమాల అప్ డేట్ తో హడావిడి చెయ్యడానికి ముహూర్తం పెట్టిన జులై 4th ఈ రోజే కావడం తో ఈ సోమవారానికి ఎంతో ప్రత్యేకం కలిగివుంది అంటున్నాం. మరోకాసేపట్లో మహేష్ బాబు AMB మాల్ లో శ్రీ విష్ణు నటించిన అల్లూరి టీజర్ రిలీజ్ కాబోతుంది. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ చేసిన హ్యాపీ బర్త్ డే నుండి సాంగ్ అది కూడా పార్టీ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు, తమిళ, మలయాళంలో నటించిన సీత రామమ్ నుండి సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు.
అన్నిటిలో ముఖ్యమైనది మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లుక్ ఈరోజే రివీల్ చేస్తున్నట్లుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. జులై 4 సాయంత్రం చిరంజీవి గాడ్ ఫాదర్ లుక్ రాబోతుంది. ఆ తర్వాత AMB మాల్ లో కళ్యాణ్ రామ్ నటించిన చారిత్రాత్మక చిత్రం బింబిసారా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చెయ్యబోతున్నారు. ఇలా ఈరోజు సోమవారం సోషల్ మీడియా మొత్తం టాలీవుడ్ సినిమాల అప్ డేట్స్ తో కళకళలాడిపోతుంది.
1. #Alluri teaser launch
2. #Godfather 1st look
3. #HappyBirthday party song
4. #Bimbisara trailer launch
5. #Sitaramam song launch