బాలీవుడ్ లో అలియా భట్ అంటే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీలో నటించి సౌత్ కి దగ్గరయిన ఈ భామ గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అంటుంది. అలియా భట్ బికినీ వేసినా.. చీర కట్టినా ఆ అందం వర్ణించడం చాలా కష్టం. సొట్ట బుగ్గల చిన్నది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత ఈ ఏడాది పెళ్లి పీటలెక్కడం అన్ని విషయాలు తెలిసిందే. రీసెంట్ గానే అలియా భట్ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్పి అందరిని థ్రిల్ చేసింది. మరి తల్లవుతుంది.. సినిమాలకు బ్రేకిస్తుంది అనుకుంటే నెటిజెన్స్ దిమ్మతిరిగేలా షూటింగ్స్ లో వాలిపోయింది.
అయితే తాజాగా అలియా భట్ రన్వీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొంది. సమంత, జాన్వీ కపూర్, అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ఇలా కరణ్ జోహార్ షో లో మెరిసిన సెలెబ్రిటీ క్లిప్స్ ని ప్రోమోగా చేసి వదిలారు. ఆ ప్రోమోలో అలియా భట్ - రన్వీర్ కలిసి ఆ షోలో ఎంటర్టైన్ చేసారు. మరి ఆ షో కోసం అలియా భట్ చాలా చిట్టి పొట్టి ఫ్రాక్ వేసుకుని వచ్చింది. ఆ చిన్న ఫ్రాక్ లో అలియా అందాలు అద్భుతంగా ఆరబోసింది. అయితే ఆ షో కోసం అలియా భట్ వేసుకున్న ఫ్రాక్ ధర త్తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అలియా భట్ ఫ్రాక్ అక్షరాలా 85 వేల రూపాయలట. మరి అంత చిన్న ఫ్రాక్ డిజైన్ చెయ్యడానికి 85 వేల ఖర్చంటే ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. మరి ఆ డ్రెస్ లో అలియా ని అలా చూస్తే తల్లవుతున్నా ఈ భామ తగ్గేదేలే అంటుందిగా అనేస్తారు. మరి మీరు అలియా భట్ గ్లామర్ షో ని ఓ లుక్కెయ్యండి.