ప్రభాస్ బాహుబలి తర్వాత వరసగా చాలా రాంగ్ స్టెప్స్ వేశారు అనేది ప్రభాస్ ఫాన్స్ ఫీలింగ్. ఒక్కో సినిమా, అలాగే చిన్న సినిమాలు చేసిన దర్శకులతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేసి చేతులు కాల్చుకున్నారు. సుజిత్ ఒకే ఒక్క సినిమా చేసి సాహో లాంటి బిగ్ ప్రాజెక్ట్ చేసాడు. అతనికి అనుభవం సరిపోలేదు అన్నారు. రాధాకృష్ణ జిల్ సినిమా చేసి రాధే శ్యామ్ లాంటి ప్రాజెక్ట్ చేసి ప్రభాస్ కి ప్లాప్ ఇచ్చారు. తర్వాత ప్రభాస్ లైనప్ చూసిన ఫాన్స్ కూల్ అయ్యారు. ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే తో నాగ్ అశ్విన్, సలార్ తో ప్రశాంత్ నీల్, స్పిరిట్ తో సందీప్ వంగా. ఇలా ఆయన లైనప్ కి అదిరిపోయే దర్శకులు దొరికారని సంబరపడ్డారు.
కానీ మళ్ళీ చిన్న దర్శకుడు మారుతికి ప్రభాస్ ఓకె చెప్పారనగానే కంగారు పడ్డారు. అయినా ఏదో మనసుకు సర్ది చెప్పుకున్నారు. కానీ తాజాగా మారుతి పక్కా కమర్షియల్ రిలీజ్ అయ్యి సో సో టాక్ తెచ్చుకోవడంతో మారుతి తో సినిమా అంటేనే ప్రభాస్ ఫాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్ ఫస్ట్ డే ఫస్ట్ షో కే తేలిపోవడంతో ప్రభాస్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. గోపీచంద్ లాంటి హీరోకి హిట్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా ని ఎలా డీల్ చేస్తావ్ మారుతి అంటూ ప్రభాస్ ఫాన్స్ లో టెంక్షన్ మొదలయ్యింది. అటు ప్రభాస్ కి కూడా ఫాన్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు. మారుతి సినిమాని అవాయిడ్ చెయ్యండి అంటూ..