Advertisementt

విగ్నేష్ ని గట్టిగా హగ్ చేసుకున్న నయన్

Sun 03rd Jul 2022 11:35 AM
nayanthara,vignesh shivan,loved-up pics,nayanthara - vignesh shivan  విగ్నేష్ ని గట్టిగా హగ్ చేసుకున్న నయన్
Nayanthara hugs Vignesh Shivan in cute new pics విగ్నేష్ ని గట్టిగా హగ్ చేసుకున్న నయన్
Advertisement
Ads by CJ

విగ్నేష్ శివన్ - నయనతార ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈమధ్యనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. జూన్ 9 న అంగరంగ వైభవంగా విగ్నేష్ - నయనతార వివాహం జరిగింది. తర్వాత ఈ జంట గుడులు గోపురాలు దర్శించుకుని ఆ తర్వాత హనీమూన్ ట్రిప్ వేశారు. హనీమూన్ కోసం బ్యాంకాక్ ని ఎంచుకుంది ఈ జంట. హనీమూన్ లో వారు ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నయనతార చాలా సింపుల్ గా మెడలోని మంగళ సూత్రంతో హనీమూన్ పిక్స్ లో కనిపించింది. 

ఇక ఈమధ్యనే హనీమూన్ ముగించుకుని చెన్నై కి చేరుకున్నారు విగ్నేష్ అండ్ నయన్ లు. తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. నయనతార షారుఖ్ ఖాన్ - అట్లీ తో చేస్తున్న జవాన్ ప్రాజెక్ట్ కోసం ముంబై వెళ్ళింది. అక్కడ జవాన్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక విగ్నేష్ శివన్ తన షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. తాజాగా ఈ జంట ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నయనతార బిగి కౌగిలిలో విగ్నేష్ శివన్ కనిపిస్తున్నాడు. రొమాంటిక్ గా నయనతార ప్రేమతో విగ్నేష్ శివన్ ని హత్తుకున్న పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. బ్యాగ్రౌండ్ లో అందమైన ప్రకృతి, నయనతార మెడకింద విగ్నేష్ తల అబ్బో చూడముచ్చటగా ఉంది ఈ ఫోటో గ్రాఫ్.

Nayanthara hugs Vignesh Shivan in cute new pics:

Nayanthara - Vignesh Shivan Loved-Up Pics Go Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ